రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా గల నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఒక్కరేనని మాజీ మంత్రి విశ్వరూప్ చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్ సిపిలో చేరినట్లు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం తాను మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. రాష్ట్ర విభజనకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడంతో పినిపే విశ్వరూప్ మంత్రి పదవికి, పార్టీకి గత నెలలో రాజీనామా చేశారు. నేరుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కే ఆయన రాజీనామా లేఖ ఇచ్చారు. గవర్నర్ దానిని ఆమోదించారు.