ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా వైఎస్ విజయమ్మ జిల్లాకు చేరుకుంటారు. నియోజకవర్గంలోని జైనథ్ మండలంలో పెండల్‌వాడలో వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మతో పాటు పార్టీ నేతలు కొండా సురేఖ, జనక్ ప్రసాద్, కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొండా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. పంటలు నీటమునిగి కుళ్ళిపోయాయి. జిల్లాలోని జైనత్ మండలం పెండల్ వాడలో పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది.