కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత | Union Minister Maneka Gandhi hospitalised | Sakshi
Sakshi News home page

Jun 2 2017 4:32 PM | Updated on Mar 22 2024 10:55 AM

కేంద్రమంత్రి మేనకా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. యూపీ పర్యటనలో ఉన్న ఆమె అస్వస్థతకు గురి కావడంలో పిలిబిత్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మేనకా గాంధీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ తరలించనున్నట్లు సమాచారం. కాగా మేనకా గాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల ఆస్పత్రిలో చేరిన వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఏర్పడ్డాయని, దీంతో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement