విద్యుత్ కోతల నుంచి రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ, ఉత్తర గ్రిడ్ ల నుంచి యూనిట్ కు 8.50 రూపాయలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాలని సోమవారం జరిగిన సమావేశంలో తీర్మానించారు. విద్యుత్ వాడకం భారీగా పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో డిమాండ్, సప్లైల మధ్య వ్యత్యాసం పెరిగింది. తెలంగాణలో ప్రస్తుత డిమాండ్ 161 మిలియన్ యూనిట్లు కాగా, సప్లై 137 మిలియన్ యూనిట్లు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యని తగ్గించాలంటే మరో 24 మిలియన్ల యూనిట్లు అవసరం ఉంది. తాజా విద్యుత్ సంక్షోభ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అదనపు విద్యుత్ కొనుగోలు చేయాడానికి నిర్ణయం తీసుకుంది.