కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గద్వాల, జనగామ గురించి అఖిలపక్షంలో ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగానే జరుగుతుందని తలసాని స్పష్టం చేశారు.