కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రరెడ్డిని నలుగురు యువకులు బండరాయితో మోది హతమార్చారు. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా శైలేంద్రరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ శైలేంద్రరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి నంద్యాల వచ్చారు