సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్య సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే మరో సీనియర్ జర్నలిస్టు కేజీ సింగ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పంజాబ్ మొహాలీలోని నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటనలో ఆయన తల్లి గురుచరణ్ కౌర్ (92) కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని సృష‍్టించింది.