దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మద్యం డీలర్లకు చివరి పండుగ కావడం.. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాపారం జోరుగా సాగింది. పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా రూ.350 కోట్ల వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.