నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని రిషితేశ్వరి కేసు పురోగతిపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం గవర్నర్ కలిసిన నేపథ్యంలో యూనివర్శిటీకి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఇప్పటి వరకూ జరిగిన విచారణ ఎలా సాగిందని గవర్నర్ వివరణ కోరారు. ఆ విద్యార్థినిపై ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. దీంతో పాటు యూనివర్శిటీలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గంటాను ఆదేశించారు.
Aug 4 2015 6:33 PM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement