ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు | Rajiv Arogya Sri now wears NTR tunic | Sakshi
Sakshi News home page

Nov 18 2014 5:09 PM | Updated on Mar 22 2024 11:29 AM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదుగంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇసుక తవ్వకాలు, పింఛన్లు, గనుల లీజు అంశాలపై ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేబినెట్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటుకు ఆమోదం ఎన్టీఆర్ వైద్య సేవలో వ్యాధుల సంఖ్య 938 నుంచి 1038కు పెంపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పరిమితి రూ. 2.5 లక్షలకు పెంపు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల రద్దు మంగంపేట గనుల మైనింగ్ తక్షణమే నిలిపివేత రాజధాని ప్రాంతంలోకి 29 గ్రామాలను తీసుకురావాలని నిర్ణయం

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement