లారీల సమ్మె అంశాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. లారీల సమ్మె కారణంగా రవాణావ్యవస్థ నిలిచిపోయిందన్నారు. సమ్మె కారణంగా చేతికొచ్చిన పంటను రైతులు ఎగుమతి చేసుకోలేకపోతున్నారన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, లారీ యూనియన్‌ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా వాహనాలపై బీమా మొత్తాన్ని ఏకంగా 41% పెంచడానికి వ్యతిరేకంగా లారీ యాజమానుల సంఘం సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.