తమిళనాడులో అత్యంత పురాతన క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. కాగా సంబంధిత బెంచ్ ముందు పిటిషన్ వేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆదేశించారు.