గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియకు ప్రభుత్వం మరోమారు చట్ట సవరణ చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 33 (ఏ-డీ)కి సవరణల ద్వారా ఎన్నికల షెడ్యూల్ కాలాన్ని 26 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిస్తూ ఈ నెల 4న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణ సెలవు దినాల్లో సైతం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియల కోసం ఎన్నికల యంత్రాంగం పనిచేసేలా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసింది.