వేర్పాటువాదులు, ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాశ్మీర్ వేర్పాటువాద నేత ఆలం విడుదలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఈ సందర్భంగా ప్రధాని సభలో వివరణ ఇచ్చారు. ఆలం విడుదలపై సభ్యుల ఆందోళనలతో తాను ఏకీభవిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆలం విడుదలపై కేంద్రానికి సమాచారం లేదన్నారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులకు కూడా సమాచారం లేదన్నారు. ఈ ఘటనపై వివరణలు వచ్చిన తర్వాత సభకు తెలియచేస్తామన్నారు.
Mar 9 2015 1:11 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement