లోక్‌పాల్ బిల్లును ఈనెల 16న (సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిని ఆమోదించాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని, ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అంశాల జాబితాలో దీనిని చేర్చడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి హరీష్ రావత్ గురువారం మీడియాతో అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, దీనిని శుక్రవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నామని, తర్వాత ఇది లోక్‌సభ ముందుకు వస్తుందని చెప్పారు.