సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని ఆయా జిల్లాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సింగరేణి జిల్లాల్లో బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి బొగ్గుబావుల పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ పార్టీ నాయకులు ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌వీ ప్రకాశ్, సుధాకర శర్మలతో కలసి ‘కిషన్‌రెడ్డి బొగ్గుబావుల పర్యటన’ పోస్టర్‌ను విడుదల చేశారు.