కేరళలోని త్రివేండ్రంకు చెందిన ఏనుగు 'దాక్షాయణి' గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కనుంది. ప్రపంచంలో జీవించివున్న ఏనుగుల్లో అత్యధిక వయసు కలిగిన ఏనుగమ్మగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించనుంది. 86 ఏళ్ల వయసున్న 'దాక్షాయణి' పేరును రికార్డులకు ఎక్కించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీబీడీ) ఇప్పటికే గిన్నిస్ అధికార వర్గాలకు లేఖ రాసింది.