పెట్టుబడిదారులకు హైదరాబాద్‌ను స్వర్గధామంగా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కంపెనీలకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే పాలసీ విధానాన్ని తెస్తానని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమాన పరికరాల తయారీ పరిశ్రమకు తెలంగాణ కేసీఆర్ సోమవారం హైటెక్స్‌లో శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఈ ప్రాజెక్టుకు నాంది పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తామని, పరిశ్రమల పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్ టెక్నాలజీ అభివద్ధికి హైదరాబాద్ వేదికగా మారిందన్నారు. టాటా గ్రూప్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టాటా, రుయాక్ సంస్థల జాయింట్ ప్రాజెక్టుగా ఈ పరిశ్రమ రూపకల్పన జరుగుతోంది. రూ.500 కోట్ల వ్యయంతో డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
Jun 23 2014 8:12 PM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement