తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన వందలాది కోట్ల ఆస్తులకు వారసురాలు ఎవరు? ఆమె ఎవరి పేరిటైనా ఇప్పటికే వీలునామా రాశారా? జయలలిత మరణం తర్వాత ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలివి! అయితే 16 ఏళ్ల కిందటే జయ తన రక్తసంబంధీకురాలిపై వీలునామా రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్ చిరునామాతో మరో రెండు ట్రస్టులను కూడా ఆమె రిజిస్టర్ చేశారు. వీలునామా ఎవరి పేరిట రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని రాసిన వారసురాలు (లీగల్ హెయిర్)కు మినహా ఇతరులకు వెల్లడించేందుకు వీలు కాదని పేర్కొంటున్నారు.