సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై హైకోర్టు స్పందించింది. విజయవాడ ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆయన గన్‌మెన్ దశరథపై టీడీపీ ఎంపీ, కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.