ఉపరితల ఆవర్తన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.