రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి రాజ్భవన్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన ప్రణబ్ ముఖర్జీ రాజ్భవన్కు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ, అధికార, ఇతర ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. కాగా అనారోగ్య కారణంగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు దూరంగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విందులో పాల్గొన్నారు.