అమీర్పేటలో అగ్నిప్రమాదం | fire-accident-in-ameer-pet | Sakshi
Sakshi News home page

Dec 9 2014 8:20 PM | Updated on Mar 22 2024 11:22 AM

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలో సవేరా హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. నిత్యం జనసమ్మర్థం ఉండే మైత్రీవనం ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మైత్రీవనం వద్ద జనం భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement