బాలుడ్ని బలితీసుకున్న వీధి కుక్కలు.. | Dogs killed a five years boy in Guntur district | Sakshi
Sakshi News home page

Sep 21 2017 6:50 PM | Updated on Mar 21 2024 6:45 PM

కుక్కల స్వైర విహారం రోజు రోజుకు పెరిగిపోతోంది. నగర శివారులోని అడవితక్కెళ్లపాడులోని రాజీవ్‌ గృహకల్ప వద్ద విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై బుధవారం వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శరీరంపై పలుచోట్ల గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు గురువారం మృతిచెందాడు. మేడ్చల్‌ లో రంజాన్‌ పండుగ రోజు మసీద్‌ బయట ఆడుకుంటున్న చిన్నారిని వీధి కుక్కలు బలితీసుకున్న విషయం తెలిసిందే. అందరూ నమాజ్‌ చేస్తుండగా ఫారూక్‌ మజీద్‌ సమీపంలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పోట్లాడుకుంటూ వచ్చిన ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా ఫారూక్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఫారూక్‌ మరణించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement