రెవెన్యు మిగులు ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అవసరం లేకున్నా అప్పులు తెస్తున్నారని, అధికారం అంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉందని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ హామీని అమలు చేయాలని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.