‘‘మళ్లీ మనమే అధికారం లోకి వస్తాం. ఈసారి ఎన్నికల్లో కనీసం 101 నుంచి 106 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. పార్టీ చేయించిన సర్వేలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే జాతకం నా దగ్గరుంది. ఆ వివరాలు ఎవరివి వారికి ఇస్తా. పనితీరు సరిగా లేనివారు కుంగిపోవాల్సిన పనిలేదు. ఇంకొంచెం కష్టపడండి. సర్వేలో మంచి పర్సెంటేజీ వచ్చిన వాళ్లూ పొంగిపోవొద్దు. ఇంకా కష్టపడాలి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనిచోట కూడా పార్టీకి మంచి ఆదరణ ఉంది. అదే మీకు శ్రీరామరక్ష. ఆయా ఎమ్మెల్యేలు బాగా పర్యటించాలి. బహిరంగ సభలు పెట్టండి. నేను హాజరవుతా’’ అంటూ ఎమ్మెల్యేలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు.