‘క్లోజ్‌’వే! | causeway collapesed due to heavy rain | Sakshi
Sakshi News home page

Sep 23 2016 10:15 AM | Updated on Mar 21 2024 9:00 PM

పాచిపెంట మండలం మోసూరు వద్ద వట్టిగెడ్డపై నిర్మించిన కాజ్‌వే గురువారం మధ్యాహ్నం కొట్టుకుపోయింది. అదే సమయంలో గెడ్డదాటుతున్న నలుగురు కొట్టుకుపోగా... వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఈ కాజ్‌వే కొట్టుకుపోగా... అదే సమయంలో కాజ్‌వేనుంచి గెడ్డ దాటుతున్న మోసూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పలువురు సాలూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ సిబ్బంది ఉధతంగా ప్రవహిస్తున్న నదిని దాటుకుంటూ వెళ్లి నలుగురు యువకులనూ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇదిలావుండగా హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలోనే కాజ్‌వే కొంతమేరకు కొట్టుకుపోయింది. దానికి చేపట్టిన మరమ్మత్తు పనులు తూతూమంత్రంగా జరిపారన్న విమర్శలున్నాయి. ఆ కారణంగానే బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతోlమిగిలిన కాజ్‌వే కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement