పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు, మంత్రులు తగిన సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు