ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది.