వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం | - | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం

Jun 24 2025 3:47 AM | Updated on Jun 24 2025 3:47 AM

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం

కడప ఎడ్యుకేషన్‌: వైయస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించారు. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ వారు అందించిన సర్టిఫికెట్‌ సోమవారం సాయంత్రం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ ఈజి అశోక్‌ కుమార్‌తో కలిసి అందుకున్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్‌ 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగా ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్‌ 21న వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో ‘ఫ్యామిలీ యోగ థీమ్‌‘ తో యోగా నిర్వహణకు గాను వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement