మద్యం అమ్మకాలపై ఆబ్కారీ ఆంక్షలు
కంట్రోల్ రూం నంబర్లు
ఎన్నికల నియమావళిని ఉల్లఘించి ఎవరైనా మద్యం పంపకాలు చేసినా, నిల్వ చేసినా కంట్రోల్‌రూంకు సమాచారం ఇవ్వాలి. ఎకై ్సజ్ సిబ్బందితో పాటు డీటీఎఫ్, ఎస్‌టీఎఫ్ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తాయి.
–విష్ణుమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
ఆలేరు: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఎన్నికల సందర్భంగా కొంతమంది నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మద్యం దుర్విని యోగం కాకుండా ఉండేందుకు ఎన్ని కల కమిషన్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఆంక్షలు విధించింది. విచ్చలవిడిగా మద్యం విక్రయించకుండా పరిమితి విధించింది. నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం అక్రమరవాణాపై ఫిర్యాదు చేయడానికి, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మద్యం పంపకాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ఆలేరు, మోత్కూరు, భువనగిరి, రామన్నపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.
ఒకరికి ఆరు ఫుల్ బాటిళ్లు
ఒకరికి ఆరు ఫుల్‌బాటిళ్లు, బీర్లు అయితే ఒక కాటన్ మాత్రమే విక్రయించాలని ఎకై ్సజ్ అధికారులు వైన్స్‌ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. సదరు వ్యక్తులు కొనుగోలు చేసిన మద్యాన్ని బెల్ట్‌షాప్‌లకు లేదా గ్రామాల్లో ఓటర్లకు పంపకాలకు వినియోగించినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోనున్నారు.
ఆలేరు 8712658955
మోత్కూరు 8712658957
భువనగిరి 8712658956
రామన్నపేట 8712658958
ఫ వినియోగదారులకు పరిమితి మేరకే మద్యం విక్రయం


