కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత సూచించారు. ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో భువనగిరి కోర్టు కానిస్టేబుల్స్‌తో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీపడదగిన కేసులను గుర్తించడంతో పాటు కక్షిదారులతో మాట్లాడి లోక్ అదాలత్‌లో పరి ష్కరించుకునేందుకు ముందుకు వచ్చేలా కృషి చేయాలని కోరారు. కరప్రతాల ద్వారా లోక్‌అదాలత్‌పై విస్తృత ప్రచారం చేయాలన్నారు.
మానసిక వికలాంగులకు ఉచిత న్యాయ సేవలు
భువనగిరి: మానసికంగా, వైకల్యంతో బాధపడే వారికోసం అనేక చట్టాలున్నాయని, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయసేవలు అందించనున్నట్లు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి మాధవిలత పేర్కొన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం భువనగిరి మండలం రాయగిరి వద్ద ఉన్న సహృదయ వయోవృద్ధుల అనాథ అశ్రమంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మానసిక వికలాంగులకు చట్టపరంగా అందాల్సిన సేవలను వర్తింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయశ్రీ, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్‌చైర్మన్ దిడ్డి బాలాజీ, డైరెక్టర్ జంపాల అంజయ్య, పట్టణ డైరెక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జయశ్రీ, సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి జలాల్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు
బొమ్మలరామారం: మండలంలోని జలా ల్‌పూర్ జెడ్పీ హైస్కూ ల్‌కు చెందిన ముగ్గు రు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 25న సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీల్లో సాఫ్ట్‌బాల్ క్రీడలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అండర్–14 బాలుర విభాగంలో గజ్జెల్లి లోకేష్, బాలికల విభాగంలో గజ్జెల్లి ప్రణవి, అండర్–17లో జాగిల్లపురం మహేందర్ ఎంపికయ్యారు.
7న సాయుధ దళాల పతాక దినోత్సవం
నల్లగొండ టూటౌన్ : సాయుద దళాల పతాక దినోత్సవాన్ని ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ఆర్థిక సాయం అందించడం కోసం విరాళాల సేకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి


