‘మొదటి’ లెక్క తేలింది..
వలస ఓటర్లపై స్పెషల్ ఫోకస్..
సర్పంచ్ బరిలో 568, వార్డు స్థానాలకు 2,899 మంది పోటీ
సాక్షి యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. తొలి విడత బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల జాబి తాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. సర్పంచ్ స్థానాల్లో 130, వార్డు స్థానాల్లో 168 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాన పార్టీల మద్దతుదారులు.. గురువారం నుంచి మరింత వేడెక్కించనున్నారు.
పోటీలో మిగిలిన అభ్యర్థులు..
తొలి విడతలో తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, ఆత్మకూర్(ఎం) మండలాల్లోని 153 గ్రామ పంచాయతీలు, 1,284 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 153 పంచాయతీల్లో 10 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 698 మంది నామినేషన్ వేయగా, ఇందులో 130 మంది ఉపంహరించుకున్నారు. దీంతో 143 సర్పంచ్ పదవులకు 568 మంది పోటీ పడుతున్నారు. ఇక 1,284 వార్డులకు గాను 191 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,094 వార్డు స్థానాలకు 3,067 మంది నామినేషన్ వేయగా.. అందులో 168 మంది విత్‌డ్రా చేసుకున్నారు. 2,899 మంది పోటీలో మిగిలారు.
ఇక ప్రచార జోరు
మొదటి విడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన అభ్యర్థులు.. జోరు పెంచనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల లెక్కలు తీసే పనిలో అభ్యర్థులు, వారి అనుచరులు నిమగ్నమయ్యారు. అనుకూలురు, వ్యతిరేకులు, నూట్రల్స్ ఎవరో లెక్కలు తీస్తున్నారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధికి తాము ఏం చేయదలుచుకున్నారో రూపొందించిన సొంత మేనిఫెస్టోలను ఓటర్లకు వివరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా సొంత మేనిఫెస్టెలను ప్రకటించారు. వాల్‌పోస్టర్లు, డోర్ పోస్టర్లు, బ్యానర్లు తయారు చేయించారు. కొందరు ప్రత్యేకంగా ప్రచార వాహనాలను సిద్ధం చేసుకున్నారు.
ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటూ కీలకమే. పలుచోట్ల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావం చూపే స్థాయిలో వలస ఓటర్లు ఉన్నారు. వారిపై అభ్యర్థులు, వారి అనుచరులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి.. పోలింగ్‌రోజున తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు చైన్నె, సూరత్, మహారాష్ట్రకు ప్రజలు వలస వెళ్లారు. వారంతా ప్రతి ఎన్నికల్లో సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేస్తుంటారు. అభ్యర్థులు ఈ ఓటర్లను గుర్తించి, వారికి ఫోన్లు చేసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రానుపోను రవాణా చార్జీలు, భోజనం ఇతరత్రా వాటికి లెక్కకట్టి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ముందస్తుగానే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీలు
153
ఫ ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ
ఫ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
ఫ నేటి నుంచి వేడెక్కనున్న ప్రచారం
బరిలో మిగిలింది వీరే
వార్డు స్థానాలు
1,284
191
1,094
3,067
168
2,899
10 ఏకగ్రీవం
143 ఎన్నికలు జరిగేవి
698 నామినేషన్లు
130 విత్‌డ్రా
568 పోటీలో ఉన్నది
‘మొదటి’ లెక్క తేలింది..


