కిక్కిరిసిన బ్యాంకులు
చౌటుప్పల్ : సర్పంచ్‌గా పోటీ చేసే వారు తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు ఖాతా కల్గి ఉండాలనే నిబంధన ఉండడంతో ఖాతా తెరిచేందుకు ఆశావహులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో బ్యాంకులు రద్దీగా మారాయి. జాతీయ బ్యాంకులలో ఖాతా తెరిచేందుకు ఎక్కువ సమయం పడుతుండడంతో ఆశావహులు ఎక్కువగా సహకార బ్యాంకులకు క్యూ కడుతున్నారు. చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం, కొయ్యలగూడెం, పంతంగి గ్రామాల్లో మాత్రమే బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు సౌకర్యం లేని గ్రామాలకు చెందిన నాయకులు చౌటుప్పల్ మండల కేంద్రానికి వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు.


