పోలీసుల సేవలు మరువలేనివి
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట: నిత్యం శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా చూస్తున్న పోలీసుల సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం గుండ్లపల్లి శ్రీరాంగౌడ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, రూరల్ ఎస్‌ఐ శంకర్‌గౌడ్, ట్రాఫిక్ సీఐ ఎ.కృష్ణ, ఎస్‌ఐలు యాదయ్య, సుధాకర్, సైదులు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.


