మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదివారం మాట్లాడుతూ చంద్రబాబు బినామీలకు వైద్య కళాశాలలను కట్టబెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో నాసి రకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ప్రస్తుత ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. నిర్భయంగా వార్తలు రాస్తున్న సాక్షి యాజమాన్యంపైనా, విలేకర్లపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని మంగరాజు డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు.


