22 నుంచి కార్తీక మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం: ఈ నెల 22 నుంచి వచ్చే నెల 21 వరకు మద్ది క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు వార్షిక సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. 22న ప్రభాత సేవ, నిత్యార్చన, గోపూజ, కార్తీక మాసోత్సవాల ప్రారంభం, 24న సప్తాహ ప్రారంభ పూజా కార్యక్రమాలు, యాగశాల ప్రవేశం తదితర పూజలు, 25న పంచామృతాభిషేకాలు, 26న హనుమద్ హోమం అనంతరం సువర్చల హనుమద్ కల్యాణం, 27న స్వామి గ్రామోత్సవం, స్వామికి తమలపాకులతో వార్షిక లక్షార్చన నిర్వహించనున్నారు. 28న విశేష అష్టోత్తర పూజలు, 29న లక్ష పుష్పార్చన, 30న మద్ది ఆలయ ఉపాలయమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరస్వామికి శాంతి కళ్యాణం, 31న ప్రాతఃకాల అర్చన, మహాపూర్ణాహుతి, నవంబర్ 18న సాయంత్రం స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం, ఈ నెల 26, వచ్చే నెల 2, 9, 16 తేదీల్లో హనుమద్ హోమాలు, సువర్చల హనుమద్ కల్యాణాలు జరుగుతాయి, ఈ నెల 27, వచ్చే నెల 3, 10, 17 తేదీల్లో స్వామికి లక్ష తమలపాకుల పూజ, ఈ నెల 25, వచ్చే నెల 1, 8, 15 తేదీల్లో స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 22, 29, వచ్చే నెల 5, 12, 19 తేదీల్లో స్వామికి విశేష లక్ష పుష్పార్చన జరుగుతాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.


