బీజేపీ కార్యాలయం ముట్టడి
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారం వద్ద గల బీజేపీ జిల్లా కార్యాలయాన్ని గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ముట్టడించారు. కేంద్రంలోని మోదీ సర్కారు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై అక్రమంగా కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, శ్రీకేడీ మోదీశ్రీ అంటూ నినదించారు. వరంగల్ నగరంతోపాటు గీసుకొండ మండలం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ జెండాలతో తరలివచ్చి ముందుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లేదారిలో ధర్నా చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ పాల్గొన్నారు. వారు ధర్నా చేస్తున్న సమయంలో కారులో అటుగా వెళ్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్‌రెడ్డి అక్కడ ఆగి తన వాహనాన్ని పార్టీ కార్యాలయం వైపు తిప్పి ధర్నా చేస్తున్న వారి వద్ద హారన్ మోగించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది గమనించిన బీజేపీ కార్యాలయంలోని ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరు పార్టీల వారు తోపులాటకు దిగడంతో గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ సిబ్బందితో వెళ్లి వారిని చెదరగొట్టారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కార్యాలంలోకి వెళ్లిపోగా , కాంగ్రెస్ నాయకులు కొంత సేపు నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ విశ్వేశ్వర్ పోలీసు వాహనాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు ముఖ్య నాయకులను గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వారు నినాదాలు చేస్తూ మోదీ సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు మాట్లాడారు. నాయకులు నల్లగొండ రమేశ్, గుండేటి నరేందర్, బస్వరాజు శ్రీమాన్, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీసం సురేందర్‌రెడ్డి, సిల్వేరు శ్రీనివాస్, దుపాకి సంతోష్, కూసం రమేశ్, కరాటే ప్రభాకర్, మన్నె బాబూరావు, పరమేశ్వర్, గోరంట్ల రాజు, దూలం సంపత్, సయ్యద్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
కార్యాలయ ముట్టడి నీతిమాలిన చర్య
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించడం, ఆందోళన చేసి దాడులకు పాల్పడటం నీతిమాలిన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో
మోదీ సర్కారు తీరుపై నిరసన
పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలతోపాటు పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
రెండు పార్టీల నాయకులతో
తీవ్ర ఉద్రిక్తత
ఆందోళనకారులను చెదరగొట్టి
శాంతింపజేసిన పోలీసులు


