వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jun 2 2025 1:29 AM | Updated on Jun 2 2025 1:29 AM

వరంగల

వరంగల్‌

సోమవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2025

అధిక సాంద్రత సాగు..

లాభాలు బాగు

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే

అధిక దిగుబడి వస్తుందని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నాగభూషణం తెలిపారు.

ఔషధ నిల్వల్లో అధికారుల ఇష్టారాజ్యం

ఇరుకు గదుల్లో వందలాది రకాల ఔషధాలు

కానరాని రిఫ్రిజిరేటర్లు.. ఏసీలు మౌలిక వసతుల కొరత..

ఎంజీఎం: రోగులకు మెరుగైన మందులు అందించేందుకు ప్రతీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ (సీఎంఎస్‌) నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్‌ మెడికల్‌ హబ్‌గా మారుతున్న క్రమంలో రెండు ఇరుకై న గదుల్లో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ను మౌలిక వసతుల లేని ప్రదేశంలో ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే వరంగల్‌ జిల్లా కేంద్రంలో 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రి తో పాటు 100 పడకల సీకేఎం ఆస్పత్రి, 100 పడకల నేత్ర వైద్యశాలకు వరంగల్‌ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ నుంచే మందులు సరఫరా అవుతాయి. అంతేకాకుండా వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఉన్న పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు సైతం ఈ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచే ప్రభుత్వం అందించే మందులు సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం వేలాది మంది రోగులకు పంపిణీ చేసే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ నిర్వహణ చూస్తే పేదలపై అధికారుల ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది.

ఉర్సులో ఇరుకు గదుల్లో..

వరంగల్‌ జిల్లా కేంద్రంలోని సీకేఎం, ఉర్సు ప్రసూ తి ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీఎంఎస్‌(సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌)ను ఇరుకై న రెండు గదుల్లో ఏర్పాటు చేశారు. వరంగల్‌ జిల్లా పరిధిలో ఎంజీ ఎం, ప్రాంతీయ కంటి దవాఖాన, సీకేఎం ప్రసూతి తో పాటు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ ఆస్పత్రి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు, సర్జికల్స్‌ ఈ సీఎంఎస్‌ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న మందుల గిడ్డంగికి ముందస్తుగా క్షేత్రస్థాయిలోప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు రెండు చిన్న గదుల్లో ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. అవసరమైన విశాలమైన భవనాలను సమకూర్చాల్సింది. ఔషధాలు పాడవకుండా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషన్‌ రూములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సౌకర్యాలు లేకుండా బూత్‌ బంగ్లాను తలపించే విధంగా స్టోర్‌ భవనం ఉండడం అధికారుల పనితీరుకు నిదర్శనం.

సీఎంఎస్‌ను ఎంజీఎంలోకి మార్చాలి

తాత్కాలికంగా సీఎంఎస్‌ను ఎంజీఎంలో ఖాళీగా ఉన్న ఏదైనా బ్లాక్‌లోకి మార్చితే సమస్యకు పరి ష్కారం లభిస్తుంది. సీఎంఎస్‌ మందులలో 75 శాతం మందులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రే వినియోగించుకుంటోందని బడ్జెట్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అలాంటప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా, రోగులకు బాసటగా నిలుస్తున్న ఎంజీఎంలో తాత్కాలిక సీఎంఎస్‌ ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మందుల సరఫరా కూడా సౌకర్యంగా ఉంటుందని కొందరు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి మరికొద్ది నెలల్లో ఎంజీఎం వెళ్లనున్న నేపథ్యంలో ఎంజీఎం లేదా, కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో తాత్కాలికంగా సీఎంఎస్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు.

న్యూస్‌రీల్‌

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

ఉర్సు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌కు ఇరుకై న రోడ్లపై భారీ వాహనాలు మందులతో వస్తుంటాయి. దాంతో రాకపోకలు కష్టతరంగా మారాయని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంఎస్‌ ప్రహరీ ప్రధాన గేటులోకి వచ్చిన వాహనాలు కిటెల్‌ గార్డ్‌(ఐరన్‌ ర్యాంప్‌)లో ఇరుక్కుపోతున్నాయి.

వరంగల్‌1
1/2

వరంగల్‌

వరంగల్‌2
2/2

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement