
మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు
వంగర: మండల పరిధి మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు శుక్రవారం సంచరించింది. మూడురోజుల కిందట మండలంలోని కొత్త మరువాడ వద్ద ప్రవేశించిన తొమ్మిది ఏనుగుల గుంపు సీతాదేవిపురం, గంగాడ, నారంనాయుడువలస, నీలయ్యవలస, జగన్నాథవలస గ్రామాల మీదుగా మడ్డువలస ప్రాజెక్టు సమీపానికి చేరుకుని తిష్ఠ వేశాయి. అనంతరం పటువర్ధనం గ్రామ సమీపంలో ఉన్న వెంకన్న చెరువు వైపు ఏనుగుల గుంపు పయనమైంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బందితో పాటు వీఆర్‌వో కృష్ణ, వీఆర్‌ఏ శ్రీరాములు, పోలీస్‌సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఆర్టీసీ డీపీటీఓగా వరలక్ష్మి
విజయనగరం అర్బన్: ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి (డీపీటీఓ)గా జి.వరలక్ష్మి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న తన చాంబర్‌లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజ యనగరం జోనల్ వర్క్‌షాప్ మేనేజర్‌గా ఇంతవరకు పనిచేసిన ఆమె బదిలీపై వచ్చారు. గతంలో జోనల్ స్టాఫ్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌గా, వివిధ హోదాల్లో ఆర్టీసీలో సర్వీసు చేసిన అనుభవం ఉంది. ఇంతవరకు ఇక్కడ డీపీటీఓగా పనిచేసిన సీహెచ్ అప్పలనారాయణ దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఆమెకు కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. డీపీటీఓను కలిసిన వారిలో ఎంప్లాయీస్ యూని యన్ జోనల్ కార్యదర్శి పి.భానుమూర్తి, జిల్లా కార్యదర్శులు జి.రవికిరణ్, ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి రాఫెల్, అధ్యక్షుడు దుర్గరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పడు, తదితర సంఘం సభ్యులు ఉన్నారు.
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
పూసపాటిరేగ: పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని డీఎంహెచ్‌ఓ జీవనరాణి అన్నారు. పూసపాటిరేగ పీహెచ్‌సీని ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై వైద్యులు ప్రమీలాదేవి, బి.కృష్ణ చైతన్యను అడిగి తెలుసుకున్నారు. అతిసార నియంత్రణ కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆమె వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖరరాజు, హెల్త్ ఎడ్యుకేటర్ అనిల్‌ప్రేమ్‌కుమార్, సీహెచ్‌ఓ వేదమణి, సిబ్బంది మహేశ్వరి, నానమ్మ, జానకమ్మ ఉన్నారు.
జగన్నాథునికి పూజలు
విజయనగరం టౌన్: విజయనగరం కన్యకపరమేశ్వరీ ఆలయం వద్ద నిర్వహించిన జగన్నాథస్వామి రథయాత్రలో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె సిరిసహస్ర పాల్గొన్నారు. స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. వేదపండితులు వేదాశీస్సులు అందజేశారు.

మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు

మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు

మడ్డువలస ప్రాజెక్టు సమీపంలో ఏనుగుల గుంపు