
స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి ప్రణాళికలు
అధికారులతో సమీక్షించిన కలెక్టర్
తిరుపతి అర్బన్: స్వర్ణ నారావారిపల్లి–2029 అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి ఇప్పటి వరకు చేపట్టిన అంశాలు, చేయాల్సిన పనులపై ప్రత్యేక అధికారి, డీపీఓ సుశీలాదేవిని ప్రశ్నించారు. ఆమె చేపడుతున్న పనులను వివరించారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయ సంఘాలకు రుణాల మంజూరు, వ్యవసాయ రంగానికి సంబంధించి కిచెన్ గార్డెనింగ్, టెరరస్ గార్డెనింగ్‌పై గుర్తించిన కుటుంబాలకు శిక్షణ ఇవ్వడం, రైతుల పొలాల్లో కిట్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వివరించారు. డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్, సీపీఓ వెంకటేశ్వర్లు, పశుసంవర్థకశాఖ ఏడీ ప్రసాద్, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి సతీష్, మార్కెటింగ్ ఏడీ సురేంద్రబాబు, ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్రనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నరేంద్రబాబు, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శేషాచలం రాజు పాల్గొన్నారు.