మామిడి.. | - | Sakshi
Sakshi News home page

మామిడి..

Jul 4 2025 3:32 AM | Updated on Jul 4 2025 3:32 AM

మామిడ

మామిడి..

మెటీరియల్‌ సైన్స్‌ అనుసంధానంతో..
మెటీరియల్‌ సైన్స్‌ అనుసంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని ఐఐటీ డెరెక్టర్‌ అన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి
వైఎస్సార్‌సీపీ నరసింగాపురం పంచాయతీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌పై టీడీపీ కార్యకర్త కర్రలతో దాడిచేశాడు.
ఘనంగా ఐసీఎస్‌ఐ స్నాతకోత్సవం

శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025

8లో

తిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్‌లోని పెద్దిరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

మారానని చెప్పి ..

ధర పెంచకుండా మారాం చేస్తున్నారు!

ఆర్‌కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్‌, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్‌రెడ్డి, వెంకటేగౌడ్‌, సునీల్‌కుమార్‌, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోట రాజేష్‌, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ను పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

తపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం

తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్‌ తపాలా సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రంజిత్‌ కుమార్‌ను 93907 36277 నంబర్‌ నందు సంప్రదించాలని సూచించారు.

ఇంటర్‌ ప్రవేశాల

గడువు పొడిగింపు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్‌ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఐఓ కోరారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు భద్రతా చర్యలు

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్‌రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ లేపాక్షి ఏరియా బాలాజీనగర్‌, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్‌–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్‌ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్‌ స్క్వాడ్‌తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్‌ శేఖర్‌, సీఐలు విజయ్‌ కుమార్‌, శ్రీరాముడు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ఐఐహెచ్‌టీ స్పాట్‌ అడ్మిషన్లు

వెంకటగిరి రూరల్‌:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌ లూమ్‌ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్‌ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్‌డీ గిరిధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు.

తిరుపతి సిటీ : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్‌ఐ ఉపాధ్యక్షులు పవన్‌ జి చందక్‌, కౌన్సిల్‌ సభ్యుడు సీఎస్‌ మోహన్‌ కుమార్‌, సీఎస్‌ వెంకటరమణ, ఐసీఎస్‌ఐ ఎస్‌ఐఆర్‌సి చైర్మన్‌ సీఎస్‌ మధుసూధనన్‌, ప్రీతి కౌశిక్‌ బెనర్జీ పాల్గొన్నారు.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నష్టాల్లో మామిడి రైతు

మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు

ఏ ప్రాంతానికెళ్లినా

జన సునామీనే

భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్‌మోహన్‌ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

కష్టాల్లో మామిడి రైతులు

మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడు తూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామి డి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడి యాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు.

‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్‌ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మామిడి..1
1/5

మామిడి..

మామిడి..2
2/5

మామిడి..

మామిడి..3
3/5

మామిడి..

మామిడి..4
4/5

మామిడి..

మామిడి..5
5/5

మామిడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement