
17 నుంచి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు
తిరుపతి సిటీ : ఎస్వీయూ గంథ్రాలయం, యూజీసీ ఇన్ ప్లిబ్‌నెట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు క్యాలిబర్–2025 అనే అంశంపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏడు దేశాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని ఆర్గనైజర్ ప్రొఫెసర్ సురేంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య సుధారాణి, ఆచార్య చండ్రాయుడు, సైంటిస్ట్‌లు డాక్టర్ వల్లభ్ ప్రధాన్, శేఖర్, రాజన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఎస్వీయూలో ఉద్యోగమేళా
తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టూడెంట్స్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వర్సిటీలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య మురళీధర్, కో ఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ ఒక ప్రకటనలో తెలిపారు. పురుష అభ్యర్థులకు మాత్రమే జరిగే ఈ మేళాకు ప్రముఖ ఎంఆర్‌ఎఫ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్వీయూలోని అన్నమయ్య భవన్‌కు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని సూచించారు.
మా బడిని తరలించొద్దు
రేణిగుంట : పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ మండలంలోని కుమ్మరపల్లెలోని బేసిక్ ప్రైమరీ స్కూల్ వద్ద శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. తమ పిల్లలు అంగన్‌వాడీ నుంచి ఐదో తరగతి వరకు మా ఊరిలోని బడిలోనే 40 మంది చదువుతున్నారని, వీరిలో ఎక్కువ మంది తుమ్మలగుంట గిరిజన పిల్లలు ఉన్నారన్నారు. విలీనం చేయడంతో 3 కిలో మీటర్ల దూరంలోని ఎల్‌ఎం కండ్రిగ స్కూల్‌కు 3,4,5 తరగతి పిల్లలు వెళ్లలేక పాఠశాల మాని ఇంటి వద్ద ఉన్నారని ఆవేదన చెందారు. ఆటో వాళ్లు ఒక రోజు వస్తే మరొక రోజు రారని అందువల్ల పిల్లలను బడికి పంపించేందుకు వీలు పడటం లేదని వాపోయారు.
తూపిలిపాళెం భూముల పరిశీలన
వాకాడు : మండలంలోని తూపిలిపాళెం సముద్ర తీరంలో శుక్రవారం ప్రభుత్వ భూములను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు తన బృందంతో కలసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ , గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్‌తో కలిసి నిలిచిపోయిన దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ నిర్మాణం చేపడతారనేది ఇంకా స్పష్టత రాలేదని, 2500 ఎకరాల భూములు సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని తహసీల్దార్ రామయ్య తెలిపారు.
క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ పనులు పూర్తి చేయండి
చిల్లకూరు : చిల్లకూరు, కోట మండలాలలోని తీర ప్రాంత గ్రామాలైన తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో వందల ఎకరాలలో ఏర్పాటు చేయనున్న క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ కారిడార్‌ను శుక్రవారం ఏపీ ఇండ్రస్టియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్‌తో పాటుగా జిల్లా , డివిజన్ అధికారులు పరిశీలించారు.

17 నుంచి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు

17 నుంచి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు