
ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులు పడాలి
తిరుపతి అర్బన్ : ఫుడ్ ప్రాసెసింగ్ వైపు రైతు సంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు అడుగులు వేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ ఈడీ సతీష్ నేతృత్వంలో వారాహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు వర్క్ షాపు నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు, పలువురు చిరు వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికనుగుణంగా రైతు సంఘాల ప్రతినిధులు, చిరువ్యాపారులు మారాల్సి ఉందని పేర్కొన్నారు. అనంతరం బిహార్ నుంచి విచ్చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ చైర్మన్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. కేంద్ర సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అందిస్తున్న రాయితీలను వివరించారు. ఆహారంగా తీసుకునే అన్ని వస్తువులకు చెందిన చిన్నపాటి యంత్రాలను కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రాయితీలు ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డీహెచ్‌ఆర్వో దశరథరామిరెడ్డి, రాస్ ప్రతినిధి ప్రభాకర్, డీపీఎం షణ్ముగం,వారాహి ఫౌండేషన్ డైరెక్టర్లు హరికుమార్‌రెడ్డి, ఎల్‌డీఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులు పడాలి