
దాడి చేసిన వారెవ్వరినీ వదలం
చంద్రగిరి: చంద్రగిరిలో అరాచక పాలన సాగుతోందనడానికి వరుసగా జరుగుతున్న దాడులే నిదర్శనం.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి లేరని క్యాడర్‌పై దాడులు చేయడం అమానుషమని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదాడులు చేస్తే భయపడి లొంగిపోతారని ఎలా అనుకుంటున్నారు... ఇక్కడ వున్నది పిరికిపందలు కాదు.. జగన్‌మోహన్‌రెడ్డి సైనికులు.. మా క్యాడర్‌ను కాపాడుకోవడానికి మేమంతా ఉన్నాం.. అవసరమైతే జగన్‌మోహన్‌రెడ్డి చంద్రగిరికి వస్తారు.. అంటూ వైఎస్‌ఆర్ సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని నరశింగాపురం పంచాయతీ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి తల పగలగొట్టడాన్ని ఆయన ఖండించారు. శనివారం ప్రవీణ్‌కుమార్ ఇంటికి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో కలసి వచ్చిన ఆయన టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌కు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన మాట్లాడుతూ.. చెవిరెడ్డిని, ఆయన బిడ్డను అక్రమ కేసుల్లో ఇరికించి ఆయన వెంట నడిచే క్యాడర్‌ను భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక చెవిరెడ్డి చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరని, దాడులకు పాల్పడిన వారెవ్వరినీ వదిలే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. పల్లెల్లో ప్రశాంతమైన రాజకీయాలు చేసుకోవాలే తప్ప దాడులు చేసుకునే పరిస్థితి రాకూడదన్నారు. చంద్రగిరి చరిత్రలో ఇప్పటి వరకు అలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడే వస్తోందన్నారు. దీనిని ఆరంభంలోనే అడ్డుకోవాలని, దానికి పోలీసులు సహకరించకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని సూచించారు. ఆ తరువాత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ప్రవీణ్‌కుమార్‌తో పాటు వారి కుటుంబీకులకు అండగా నిలబడతామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నాయకులు లేరని క్యాడర్‌పై దాడులు అమానుషం
క్యాడర్‌ను కాపాడుకోవడానికి మేమున్నాం..
అవసరమైతే జగన్‌మోహన్‌రెడ్డి
చంద్రగిరికి వస్తారు
జిల్లా పార్టీ అధ్యక్షుడు
భూమన కరుణాకరరెడ్డి