
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
● రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
తిరుపతి అర్బన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మస్తాన్ పేర్కొన్నారు. తిరుపతి డిపోలో రెండో రోజు ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాల ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగో న్నతులు వెంటనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాత బస్సులను తొలగించి, కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. డీఏ బకాయిలను చెల్లించకుండా దీర్ఘకాలంగా జాప్యం చేయడాన్ని తప్పుపట్టా రు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జునయ్య, కార్యదర్శి రమేష్‌కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి సతీష్‌నాయుడు పాల్గొన్నారు.