ట్రబుల్‌ మేజర్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రబుల్‌ మేజర్‌

Jul 6 2025 6:28 AM | Updated on Jul 6 2025 6:28 AM

ట్రబు

ట్రబుల్‌ మేజర్‌

డిగ్రీలో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానాన్నే కొనసాగించాలి

డబుల్‌ మేజర్‌ వద్దే వద్దు అంటున్న కళాశాలలు

ప్రైవేటు కళాశాలల పట్టు..

మెట్టు దిగిన ఉన్నత విద్యామండలి

సింగిల్‌ మేజర్‌ విధానం వైపే ప్రభుత్వం మొగ్గు

త్వరలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తిరుపతి సిటీ : ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై తిరగబడ్డారు. దీంతో ఉన్నత విద్యామండలి కాస్త వెనుకడుగు వేసింది. డిగ్రీ కోర్సులలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్‌ మేజర్‌ విధానాన్ని కొనసాగించాలని, డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానంతో తమకు తలనొప్పి తప్పదని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యా మండలికి తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యామండలి సందిగ్ధంలో పడింది.

గత నాలుగు మాసాలుగా డబుల్‌ మేజర్‌ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించి సుదీర్ఘంగా చర్చించి నివేదిక తెప్పించుకుంది. దీంతో పాటు డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి కరిక్యులమ్‌ సైతం కమిటీ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పేరొందిన కార్పొరేట్‌, ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్‌ మేజర్‌ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది.

డబుల్‌ మేజర్‌తో సమస్యలు

డిగ్రీ కోర్సులలో డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానానికి, మల్టీ డిసెప్లేనరీ విధానానికి పెద్ద తేడా లేదని ప్రైవేటు కళాశాలలు, మేథావులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానానంతోనే విద్యార్థులకు, అటు కళాశాలలకు ఎంతో ఉపయోగకరమని వారు వాదిస్తున్నారు. డబుల్‌ మేజర్‌ విధానంతో అధ్యాపకుల కొరత, నూతన అధ్యాపకుల నియామకం, కళాశాలలలో ల్యాబ్‌ సౌకర్యాలు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాదని ఈ విధానం తలనొప్పితో పాటు భారీ ఖర్చుతో కూడుకున్నదని ప్రభుత్వానికి విన్నవించారు. ఇటు ప్రభుత్వ కళాశాలలు మాత్రం డబుల్‌ మేజర్‌ విధానం ప్రవేశపెడితే అడ్మిషన్లు పెరుగుతాయని అభిప్రాయాన్ని వెళ్లడిస్తున్నారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానాన్ని కొనసాగించేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడాల్సి ఉంది.

జిల్లా సమాచారం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18

టీటీడీ కళాశాలలు 5

ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 104

సింగిల్‌ మేజర్‌ విధానాన్ని

కొనసాగించాలంటున్న కళాశాలలు 106

డబుల్‌ మేజర్‌ కొనసాగించాలంటూ

ప్రభుత్వాన్ని కోరిన కళాశాలలు 15

ఏదైనా సరే అంటూ సిద్ధపడ్డ కళాశాలలు 6

సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌తో డిగ్రీ చదువుతున్న

విద్యార్థులు సుమారు 25 మంది

డిగ్రీ నోటిఫికేషన్‌ కోసం

ఎదురు చూస్తున్న విద్యార్థులు 32,600

సింగిల్‌ మేజర్‌తో విద్యార్థులకు ప్రయోజనం

డిగ్రీలో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లో డిగ్రీ పొందిన విద్యార్థికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా పోటీ పరీక్షలలో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా యూజీలో తీసుకున్న మేజర్‌ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకొని మంచి మార్కులు స్కోర్‌ చేసుకునేందుకు వీలుంటుంది.

– ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు, తిరుపతి

డబుల్‌ మేజర్‌ను ఎవరూ కోరడం లేదు

డబుల్‌ మేజర్‌ను ఏ విద్యార్థి కోరుకోవడం లేదు. మూడు, రెండు సబ్జెక్టులను మేజర్‌గా చదువుకునే విద్యార్థికి శ్రమ తప్ప ఉపయోగం ఉండదు. అధ్యాపకులు, మౌలిక సదుపాయా ల కల్పనలో విద్యా సంస్థలు వెనుకబడతా యి. – రాజేశ్వరి, కార్పొరేట్‌ కళాశాల అధ్యాపకురాలు, తిరుపతి

పోటీ పరీక్షలకు ఉపయోగకరం

డిగ్రీలో సింగిల్‌ మేజర్‌ విధానం చదివిన వారికి సివిల్స్‌, గ్రూప్స్‌, రీసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, వంటి పోటీ పరీక్షలలో నెగ్గేందుకు సులువుగా ఉంటుంది. డబుల్‌ మేజర్‌తో రెండు ప్రధాన సబ్జెక్ట్‌లపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

– శిరీషా, డిగ్రీ విద్యార్థిని, తిరుపతి

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ తర్వాతే నోటిఫికేషన్‌

డిగ్రీ నోటిఫికేషన్‌ కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు మూడు మాసాలుగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో ఇంటర్‌ ఫలితాలు విడుదలైనా ఇంత వరకు డిగ్రీ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోకపోవడంతో దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. కాగా ఈనెల 6వ తేదీ నుంచి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. తొలివిడత ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ పూర్తి అయిన తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

నోటిఫికేషన్‌ రాకపోవడం బాధాకరం

ఇంటర్‌ ఫలితాలు ఏఫ్రిల్‌ నెలలో వచ్చాయి. కానీ ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడం ఆశ్చర్యం. విద్యావ్యవస్థలో ఏ విధానాన్ని కొనసాగించాలో తెలియక ఉన్నత విద్యామండలి తికమక పడుతూ అడ్మిషన్లు జరపకుండా ఆల స్యం చేయడం బాధాకరం. – ప్రసన్న, డిగ్రీ నోటిఫికేషన్‌ కోసం

ఎదురు చూస్తున్న విద్యార్థిని, తిరుపతి రూరల్‌

ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఊసేలేదు

ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. మళ్లీ నూతన విధానం అంటూ డిగ్రీలో డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాలతో అడుకుంటోంది. తల్లిదండ్రులు గత ఏడాది అప్పులు చేసి ఫీజు చెల్లించిన పరిస్థితి చూశాం.

– లక్ష్మీనరసింహులు, విద్యార్థి, రేణిగుంట

ట్రబుల్‌ మేజర్‌1
1/4

ట్రబుల్‌ మేజర్‌

ట్రబుల్‌ మేజర్‌2
2/4

ట్రబుల్‌ మేజర్‌

ట్రబుల్‌ మేజర్‌3
3/4

ట్రబుల్‌ మేజర్‌

ట్రబుల్‌ మేజర్‌4
4/4

ట్రబుల్‌ మేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement