● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గోదాముల నుంచే 50కి బదులు 46 కేజీలే వస్తున్నాయంటున్న డీలర్లు ● రేషన్‌ బండ్లలో ఇచ్చేటప్పుడే బాగుండేదంటున్న జనం ● రేషన్‌ బియ్యం తూకాలపై భూమన అభినయ్‌రెడ్డి తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గోదాముల నుంచే 50కి బదులు 46 కేజీలే వస్తున్నాయంటున్న డీలర్లు ● రేషన్‌ బండ్లలో ఇచ్చేటప్పుడే బాగుండేదంటున్న జనం ● రేషన్‌ బియ్యం తూకాలపై భూమన అభినయ్‌రెడ్డి తనిఖీలు

Jul 5 2025 6:50 AM | Updated on Jul 5 2025 6:52 AM

తిరుపతి మంగళం : ప్రతి నెలా పేదలకు ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని అటు ప్రభుత్వం, ఇటు డీలర్లు బొక్కేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందక.. కూలీనాలి చేసుకుని వచ్చిన చిల్లర డబ్బుతో మసూరా బియ్యం కొనుక్కుని తినలేక.. రేషన్‌ షాపుల్లో ఇచ్చే బియ్యంతో కడుపు నింపుకుంటున్న పేదల నోటి కాడ అన్నాన్ని కొంత మంది కూటమి నేతలు , రేషన్‌ డీలర్లు లాగేసుకుంటున్నారు. పేదలకు ఇచ్చే 10, 20 కిలోల రేషన్‌ బియ్యం తూకాల్లో కక్కుర్తి పడి కోతలు కోస్తున్నారు. ఇది తిరుపతి నగరంలోని రేషన్‌ షాపుల్లో జరుగుతున్న అక్రమాలను వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి వెలికితీశారు.

రేషన్‌ అక్రమాలు

భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరంలోని రేషన్‌ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై ఏకతాటిగా 12 రేషన్‌ షాపులలో బియ్యం తూకాలను పరిశీలించామన్నారు. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించే ఇటువంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలకు రేషన్‌ బియ్యాన్ని అందించేందుకు వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి లబ్ధిదారుడికి అందాల్సిన రేషన్‌ను అందే విధంగా రసీదు వచ్చేలా ఏర్పాటు చేశారన్నారు. దాంతో రేషన్‌ సరుకుల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా ఒక వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఎండీయూ వాహనాలను రద్దు చేసి తనకు అనుకూలంగా ఉన్న కూటమి నాయకులకు రేషన్‌ దుకాణాలను కేటాయించి పేదల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల అక్రమాలతో సుమారు 35 నుంచి 40 కోట్ల కేజీల రేషన్‌ బియ్యాన్ని పక్కదారి మళ్లిస్తూ తద్వారా రూ. 900 కోట్లపై పైగా స్కామ్‌ చేస్తున్నారని ఆరోపించారు.

సీజ్‌ చేసేదెప్పుడు ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రేషన్‌ బియ్యం మామమైపోతోంది, పెద్ద ఓడల్లో పక్క దేశాలకు వెళ్లిపోతున్నాయని పవన్‌ కల్యాణ్‌, నాదేండ్ల హడావుడి చేసి సీజ్‌ ద షిప్‌ అని డైలాగులు కొట్టారన్నారు. ఇప్పుడు ఎవ్వరిని సీజ్‌ చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని సీజ్‌ చేస్తారా? ఈ రేషన్‌ వ్యవస్థను సీజ్‌ చేస్తారా అని భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పవన్‌కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ను దూషించడానికి తప్ప ప్రజలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాలంటీర్‌ వ్యవస్థను, ఇంటి వద్దే ప్రజలకు రేషన్‌ బియ్యం అందిస్తున్న ఎండీయూ వాహనాలను రద్దు చేశారే తప్ప మరొకటి కాదన్నారు. రేషన్‌షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతోనే రేషన్‌షాపుల తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి గతంలో వైఎస్సార్‌సీపీ తీసుకొచ్చిన వ్యవస్థనే కొనసాగించాలని భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అయితే రేషన్‌ దుకాణాల వద్ద ఇలా చేయడం సరికాదని, ఏదైనా ఉంటే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ అలిపిరి పోలీసులు రేషన్‌షాపు వద్దకు వచ్చి భూమన అభినయ్‌రెడ్డితో వాదించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీగా మాకు ఉందని అభినయ్‌ అన్నారు.

లబ్ధిదారుడికి ఇనుప డబ్బాతో తూకం వేసిన 35 కిలోల రేషన్‌ బియ్యాన్ని సంచితో తూకం వేయగా 31.640 కేజీలుగా తూకం చూపెడుతున్న దృశ్యం

మోసాలు బట్టబయలు

తిరుపతి నగరంలోని రేషన్‌ షాపుల్లో పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యంలో జరుగుతున్న అక్రమాలను శుక్రవారం వెఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి బయటపెట్టారు. తిరుపతి జీవకోనతో పాటు పలు ప్రాంతాల్లోని రేషన్‌ షాపుల్లో పేదలకు వేస్తున్న బియ్యం తూకాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు తీసుకెళుతున్న రేషన్‌ బియ్యాన్ని పార్టీ నాయకులు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ వెయిట్‌ మిషన్‌ (త్రాసు)పై పెట్టించారు. దాంతో 10 కేజీలు బియ్యం తీసుకున్న వారి తూకాల్లో రెండు కేజీలు, 20 కేజీలు బియ్యం తీసుకున్న వారి తూకాల్లో నాలుగు కేజీలు తక్కువ కనిపించాయి. ఏమక్కా మీరు తీసుకున్న బియ్యం ఎంత? మీకు రేషన్‌ షాపు వాళ్లు ఇస్తున్న బియ్యం తూకం ఎంత చూశారా ? అంటూ వారికి రేషన్‌ షాపుల్లో జరుగుతున్న తూకల్లో అక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఇదేమిటని ఆ రేషన్‌షాపు నిర్వాహకురాలిని అడిగితే ఇదేమీ కొత్త కాదు..ఎప్పటి నుంచి జరుగుతున్నదేనంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ రేషన్‌ గోదాముల నుంచే వచ్చే 50 కేజీల బియ్యానికి గానూ 46 కేజీలే వస్తున్నాయని రేషన్‌ డీలర్లే చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు రేషన్‌ డీలర్లు కలిసి పేదల నోటికాడ కూడు లాగేసుకుంటున్నారు.

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో1
1/5

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో2
2/5

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో3
3/5

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో4
4/5

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో5
5/5

● 10 కిలోలకు 2 కిలోల తక్కువ తూకం వేస్తున్న డీలర్లు ● గో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement