
కాగజ్‌నగర్‌టౌన్/కౌటాల: సంతానం కలుగడంలేదనే మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల మేర కు కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్‌తోటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మిడిదొడ్డి కవిత (41)కు ఐదేళ్లక్రితం చరణతో వివాహమైంది. సదరు ఉపాధ్యాయురాలు కౌటాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది.
ఇప్పటి వరకూ సంతానం కలుగకపోవడంతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆరోగ్యం నయం కాకపోవడంతో పాటు సంతానం లేకపోవడంతో మనస్తాపం చెందింది. శుక్రవారం రాత్రి భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బయట నుండి వచ్చిన భర్త పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి అన్న రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.