జైలర్‌–2లో నటి పూర్ణ | - | Sakshi
Sakshi News home page

జైలర్‌–2లో నటి పూర్ణ

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

తమిళసినిమా: ఆరంభం నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం జైలర్‌ – 2. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నటుడు రజనీకాంత్‌ హీరోగా నటిస్తుండటం. ఇంతకు ముందు దీనికి సీక్వెల్‌గా వచ్చిన జైలర్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడం. జైలర్‌ చిత్రం దర్శకుడు నెల్సన్‌ నే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం. రజనీకాంత్‌ తో పాటు కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, మళయాల సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, ఎస్‌ జే. సూర్య, నటి రమ్య కృష్ణ, మిర్ణా వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తుండటం వంటి అంశాలు హైలెట్‌ అవుతున్నాయి. కాగా బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు బదులుగా మరో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు అన్నది గమనార్హం. ఇకపోతే జైలర్‌ చిత్రంలో నటి తమన్నా భాటియా నటించిన నువ్వు కావాలయ్యా అనే పల్లవితో సాగే స్పెషల్‌ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఆ చిత్ర విజయానికి పక్కా బలంగా నిలిచింది. అదే విధంగా జైలర్‌ 2 చిత్రంలోను అలాంటి స్పెషల్‌ సాంగ్‌ చోటు చేసుకుంటుందని ఇందులో నటించడం ఇప్పటికే ప్రముఖ మోడల్‌ నోరా ఫతేహి ని ఎంపిక చేసినట్లు తెలిసింది. కాగా అదే పాటలో నటించడానికి నటి పూర్ణను కూడా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన పూర్ణ తమిళంలో తగరారు,కందకోట్టై, మునియాండి విలంగియల్‌ మూండ్రామ్‌ ఆండు తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించారన్నది గమనార్హం. ఇటీవల తెలుగులో మహేష్‌ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలో నటించిన ప్రత్యేక పాట నటి పూర్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

నటి పూర్ణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement